News April 13, 2025
ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ: హరీశ్ రావు

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనకు 50 రోజులు పూర్తయినా సహాయక చర్యల్లో పురోగతి లేదని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. హెలికాప్టర్‌లో వెళ్లి మంత్రులు పెట్టిన డెడ్‌లైన్లు మారాయే తప్ప ప్రయోజనం లేదని ఫైరయ్యారు. ఇది INC ప్రభుత్వానికి చరిత్రలో నిలిచిపోయే అప్రతిష్ఠ అని పేర్కొన్నారు. వారి మృతదేహాలను ఎప్పటికి బయటకు తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News April 15, 2025
గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు.. టీజీపీఎస్సీ క్లారిటీ

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు దురుద్దేశంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. దీని వెనుక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యూయేషన్ చేయించినట్లు స్పష్టం చేసింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని తేల్చి చెప్పింది.
News April 15, 2025
పవన్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుల అరెస్ట్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ప్రత్తిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. తాజాగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్క్‌తో పాటు పవన్ భార్యపైనా వీరు తప్పుడు పోస్టులు పెట్టినట్లు సమాచారం.
News April 15, 2025
UPDATE.. కింగ్‌డమ్ డబ్బింగ్ స్టార్ట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.