News March 27, 2024

ఖమ్మం: ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురానికి చెందిన బాదావత్ రాందాస్ ఆర్టీసీలో బస్సులో ప్రయాణిస్తూ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాందాస్ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తన భార్యతో కలిసి చికిత్స నిమిత్తం బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో బస్సు చిట్యాల శివారులో రాందాస్‌కు గుండెనొప్పి వచ్చింది. సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదని ప్రయాణికులు చెప్పారు.

Similar News

News March 7, 2026

విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

image

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

News March 7, 2026

ఖమ్మంలో న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ

image

ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో శనివారం న్యాయవాదులకు 40 గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమాన్ని హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, జస్టిస్ కె.శరత్ ప్రారంభించారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు మధ్యవర్తిత్వం కీలకమని వారు పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రాజగోపాల్ తదితరులున్నారు.

News March 7, 2026

అంధ విద్యార్థిని కృతజ్ఞతలు.. ఖమ్మం కలెక్టర్ భావోద్వేగం

image

ఖమ్మం జడ్పీ సెంటర్‌లోని నిజాంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాలను శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి, అధికారులను పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థిని భవాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయగా కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిన్నారిని ఆశీర్వదించి చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.