News April 13, 2025
బల్లికురవ: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

బల్లికురవ మండలం కొప్పెరపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి నరసరావుపేటకు వెళుతున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను స్థానికులు బయటకు తీశారు. గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News March 21, 2026
ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.
News March 21, 2026
TTD ఆలయాల ఆధునీకరణకు CM దిశానిర్దేశం

CM చంద్రబాబు సూచనలతో టీటీడీ ఆలయాలను ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సమీక్షించిన సీఎం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలను మెరుగుపరచాలన్నారు. లడ్డూ తయారీ, అన్నదానం, ప్రాణదానం సేవలను నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే సేవకులకు శిక్షణ ఇచ్చి అన్ని ఆలయాల్లో సేవలను విస్తరించాలని CM సూచించారు.
News March 21, 2026
వరంగల్: రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత

రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హన్మకొండలోని బొక్కలగడ్డ, పోతననగర్ ఈద్గాలను సందర్శించారు. ప్రార్థనలు సజావుగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ శుభం, ఏసీపీ నర్సింహారావుతో కలిసి పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆంక్షలు విధించగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.


