News April 13, 2025

సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

image

సింహాచలంలో ఈనెల 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలకు కొండమీదకు అనుమతి లేదని, ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.

Similar News

News April 16, 2026

జగన్.. ఇదేం రాక్షస మనస్తత్వం: లోకేశ్

image

AP: YCP చీఫ్ జగన్‌పై మంత్రి లోకేశ్ X వేదికగా విరుచుకుపడ్డారు. ‘తల్లిని, చెల్లిని తరిమేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రప్పా.. రప్పా నరుకుతాం. అమరావతిని మార్చేస్తాం. కట్టినవన్నీ కూల్చేస్తాం అంటారు. ఎందుకీ దుర్మార్గం? అధునాతన బోట్ల తయారీ కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా. ఇదేం రాక్షసమనస్తత్వం? వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవడం సైకోయిజమే’ అని దుయ్యబట్టారు.

News April 16, 2026

జగిత్యాల: కేసీఆర్ మహాసభ ఏర్పాట్ల పర్యవేక్షణ

image

ఈనెల 20న జగిత్యాల మినీ స్టేడియంలో జరుగనున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసభ ఏర్పాట్లను జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులతో సమన్వయం చేస్తూ, అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా కృషి చేస్తున్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.

News April 16, 2026

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి: కలెక్టర్

image

ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ఎర్రవల్లి ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మహేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరయ్యారు. మండలంలో చేసిన కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులున్నారు.