News April 13, 2025
సింహాచలం: చందనోత్సవానికి 51 ప్రత్యేక బస్సులు

సింహాచలంలో ఏప్రిల్ 30న జరిగే చందనోత్సవానికి కొండ మీదకు 51 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు శనివారం తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండమీదకు వెళ్లే బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గోశాల, శ్రీనివాస్ నగర్, అడివివరం నుంచి ఈ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఆరోజున భక్తుల వాహనాలకు కొండమీదకు అనుమతి లేదని, ఈ బస్సులు వినియోగించుకోవాలన్నారు.
Similar News
News April 16, 2025
ఖమ్మం: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలలో చేరాలి: అ.కలెక్టర్

పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వీటితోపాటు ప్రభుత్వ కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 100 శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.
News April 16, 2025
వనపర్తి: లెక్చరర్‌కు బ్రెయిన్ స్టోక్.. చిన్నారెడ్డి పరామర్శ

వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన సుదర్శన్ అడ్డాకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సుదర్శన్ బ్రెయిన్ స్టోక్‌కు గురి కావడంతో నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మంగళవారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని అందించారు.
News April 16, 2025
SUPER.. గిన్నిస్ రికార్డు కొట్టిన నాగర్‌కర్నూల్ వాసి

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ పరిధి కంటోనిపల్లి గ్రామానికి చెందిన అయినాల డేనియల్ రాజ్‌కు వరల్డ్ గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. 2024 డిసెంబర్ 1న 1,046 మంది ఆన్‌లైన్‌లో ఒకేసారి గంట సేపు కీబోర్డు ప్లే ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. గిన్సిస్ బుక్ నిర్వాహకులు హైదరాబాద్‌లోని మణికొండలో మంగళవారం రాజుకు రికార్డు పత్రాన్ని ప్రదానం చేశారు.