News April 13, 2025

శ్రీశైలంలో భక్తుల రద్దీ

image

శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు స్థానిక పాతాళ గంగలో స్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రద్దీ పెరిగింది.

Similar News

News January 13, 2026

‘రాజాసాబ్’.. హిందీలో 3 రోజుల్లో రూ.15.75 కోట్లే!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’కు హిందీలో దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి 3 రోజుల్లో రూ.15.75 కోట్లు (గ్రాస్) మాత్రమే వసూలు చేసింది. అటు ధురంధర్ మూవీ 38వ రోజు హిందీలో రూ.6.5 కోట్లకు పైగా (నెట్) వసూలు చేయడం విశేషం. కాగా ప్రభాస్ నటించిన బాహుబలి-2, కల్కి సినిమాలు హిందీలో ఫస్ట్ వీకెండ్ రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి.

News January 13, 2026

విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లకు ప్రత్యేక హాల్ట్

image

విశాఖ మీదగా వెళ్లే రైళ్లకు ప్రత్యేక హాల్టు కల్పించినట్లు వాళ్తేర్ డివిజన్ డీసీఎం పవన్ తెలిపారు.18525 బరంపూర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 18 నుంచి తిలార్ స్టేషన్లో, 12844 అహ్మదాబాద్ పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 17 నుంచి ఇచ్చాపురంలో, 22819 భువనేశ్వర్ – విశాఖపట్నం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 18 నుంచి బారువా స్టేషన్లో హాల్ట్ కల్పించినట్లు తెలిపారు.

News January 13, 2026

తిరుపతి: మళ్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మారుస్తారా..?

image

తిరుపతి శిల్ప కళాశాల ప్రాంతంలో టౌన్‌షిప్ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏడీ బిల్డింగ్ దగ్గరలోని టీటీడీ ప్రెస్ వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి గత బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అక్కడ కాదని టౌన్‌షిప్ ప్రతిపాదిత ఏరియాలో రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు చేస్తున్నారు. ఇది పూర్తయి టౌన్‌‌షిప్‌కు అడ్డంగా మారితే.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మళ్లీ మార్చేస్తారే అనే సందేహం నెలకొంది.