News April 13, 2025
సిద్దిపేట: బాలల అశ్లీల వీడియోలు పోస్ట్.. యువకుడి అరెస్ట్

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని దుబ్బాక పోలీసులు తెలిపారు. మిరుదొడ్డి మండలానికి చెందిన యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.
Similar News
News November 24, 2025
ఆర్జీలను సత్వరమే పరిష్కరించండి: HYD కలెక్టర్

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రజావాణిలో అందచేసిన అర్జీలను సత్వరమే అధికారులు స్పందించి పరిష్కరించాలని HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్లు కదివన్ పలని, ముకుంద రెడ్డిలతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.
News November 24, 2025
భద్రాద్రి: రేపు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం

డిప్యూటీ సీఎం భట్టి కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ.. రేపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాలను అత్యంత శ్రద్ధతో, సమయపాలనతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు ఈ రుణాల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య కార్యక్రమంగా ఉన్నందున ఏశాఖ ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News November 24, 2025
ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT


