News April 13, 2025
61 డాట్స్.. 30,500 మొక్కలు నాటాం: KKR

CSKతో మ్యాచ్‌లో 61 డాట్ బాల్స్ వేసిన KKR 30,500 మొక్కలను నాటినట్లు ప్రకటించింది. అలీ, నరైన్, వరుణ్, హర్షిత్, వైభవ్ మొక్కలను నాటుతున్నట్లు రూపొందించిన ఫొటోను షేర్ చేసింది. ఒక ఇన్నింగ్సులో ఇన్ని డాట్స్ వేయడం IPL చరిత్రలోనే తొలిసారి. దీంతో చెపాక్ స్టేడియంలో చెట్లతో నిండిపోయిన మీమ్స్ వైరలయ్యాయి. కాగా పర్యావరణ సంరక్షణలో భాగంగా ఒక్కో డాట్‌కు 500 చెట్లు నాటే కార్యక్రమానికి 2023లో BCCI శ్రీకారం చుట్టింది.
Similar News
News July 5, 2025
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కోచ్‌ల పెంపు

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్‌లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు 14 ఉండగా వాటిని 18 చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉ.5.05 గంటలకు బయల్దేరే వందేభారత్(20707) మ.1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మ.2.30 గంటలకు బయల్దేరే ట్రైన్(20708) రా.11 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.
News July 5, 2025
కొత్తగా 157 సర్కారీ బడులు

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.
News July 5, 2025
త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ప్రభుత్వం త్వరలో NTR బేబీ కిట్లు అందించనుంది. 2016లోనే ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్, ఆయిల్ వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి.