News April 13, 2025
హాలీవుడ్ యాక్టర్ నిక్కీ కేట్ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటుడు నిక్కీ కేట్(54) కన్నుమూశారు. అతని మరణానికి గల కారణాలు వెల్లడి కాలేదు. 1980లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిక్కీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డేజ్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్, అమెరికన్ యకుజా, ఫాంటమ్స్, ఇన్సోమేనియా, ది బేబీ సిట్టర్ తదితర 40 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అలాగే దాదాపు 30 టీవీ సిరీస్‌లలోనూ నటించారు. హాలీవుడ్‌లో కల్ట్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు.
Similar News
News April 19, 2026
ప్రభ్‌సిమ్రన్.. మ్యాచును మలుపు తిప్పేస్తాడు!

పంజాబ్ విజయాల్లో శ్రేయస్‌తో పాటు ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ పాత్ర ఎంతో ఉంది. బౌలర్ ఎవరనేది లెక్క చేయకుండా సిక్సర్లు, బౌండరీలతో మ్యాచును మలుపు తిప్పేయడం ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్ స్పెషాలిటీ. ఇప్పటివరకు 56 IPL మ్యాచుల్లో 1,516 రన్స్ చేశారు. 2023లో ఢిల్లీపై సెంచరీ చేశారు. స్ట్రైక్ రేట్ 154గా ఉంది. 2026 సీజన్లో 5 మ్యాచుల్లోనే 70 సగటుతో 211 రన్స్ చేశారు. తాను యువీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నానని ఇటీవల చెప్పారు.
News April 19, 2026
‘కొంగ జపం’ చేసేవారితో జాగ్రత్త!

భగవంతుడి నామాన్ని నిత్యం పలకడాన్ని ‘జపం’ అంటారు. మంచివారిగా నటిస్తూ మోసం చేసేవారి గురించి చెప్పే సందర్భంలో ‘కొంగ జపం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఇది పంచతంత్రంలోని కొంగ-ఎండ్రకాయ కథ నుంచి వచ్చింది. ఎండిపోతున్న చెరువులో ఓ కొంగ ఉండేది. వేటాడటం కష్టమవడంతో కళ్లు మూసుకొని జపం చేస్తున్నట్లు నటించేది. చేపలను మరో చెరువులోకి తీసుకెళ్తానని చెప్పి తినేది. చివరికి ఎండ్రకాయ దానిని చంపేస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 19, 2026
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి అప్‌డేట్

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘కళ్యాణ్ బాబుకు విజయవంతంగా <<19685329>>సర్జరీ<<>> జరిగింది. ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. సాధారణ స్థితికి వచ్చేందుకు వారం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన, ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.


