News April 13, 2025
సిద్దిపేట: లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. కరీంనగర్ పద్మ నగర్‌కి చెందిన వారు బంధువుల పెళ్లికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు వెళ్లి వస్తుండగా టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుమారుగా 10 మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉంది.
Similar News
News January 12, 2026
మమకారాల గోదావరి.. మట్టివాసన పిలుస్తోంది!

ఏంటయ్యా సత్తిబాబు.. ఇంత పొద్దున్నే బస్టాండ్ దగ్గర ఏం చేస్తున్నావ్ అని సూరిబాబు పలకరిస్తే, “హైదరాబాద్ నుంచి వచ్చే కొడుకు కోసం మీ చెల్లి కోడికూయకముందే ఇక్కడికి పంపేసింది” అని బదులిచ్చాడు సత్తిబాబు. ఇది ఒక్క సత్తిబాబు కథే కాదు.. సంక్రాంతి వేళ గోదావరి పల్లెల్లో ప్రతి బస్టాండ్ దగ్గర కనిపించే దృశ్యం ఇది. ఇలా నీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే అమ్మానాన్నల కోసం ఎలా అయినా ఊరెళ్లు మామా.
News January 12, 2026
GNT: ప్రమాదంలో ఇద్దరి యువకుల మృతి.. కారణమిదేనా.?

తాడికొండ (M) లాం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం అతివేగం అని పోలీసులు భావిస్తున్నారు. స్నేహితుడు నేలపాటి వినీత్‌కు పదవి రావడంతో YCP ఇన్ఛార్జ్ డైమండ్ బాబును కలిసేందుకు వెళ్లొస్తుండగా ప్రమాదం జరిగింది. తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్ (17) మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. తరుణ్ తల్లి గతంలో మరణించగా, తండ్రి కూడా కొద్దీ నెలల క్రితమే చనిపోయారు.
News January 12, 2026
మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. కాగా రోశయ్య 2021లో మరణించారు. ఆయన 2009-10 మధ్య ఏపీ సీఎంగా పనిచేశారు. 2011-16 మధ్య తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారు.


