News March 27, 2024
MBNR: ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బే ?

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఏదైనా పని మీద బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బ తగిలితే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, నాలుక తడి ఆరిపోతుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవడం, దాహంగా అనిపిస్తుంది. వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. బయటికి వెళ్తే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట లేత రంగు బట్టలు ధరించాలి.
Similar News
News March 31, 2026
పాలమూరు: జాబ్ మేళా.. 120 మంది హాజరు

మహబూబ్ నగర్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 6 సంస్థలలో మొత్తం 500 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 120 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు. వివిధ సంస్థల సభ్యులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
News March 31, 2026
MBNR: ఏప్రిల్ 1 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రయోగ పరీక్షలు

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు. వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించవచ్చు.
News March 31, 2026
MBNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.


