News April 13, 2025
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతోశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.
Similar News
News April 17, 2025
కడప: 2 టౌన్ పోలీస్ స్టేషన్లో యువకుడి ఆత్మహత్య?

కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గత అర్ధరాత్రి యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాశ్‌కు చెందిన సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్‌కి వెళ్ళి చొక్కా గ్రిల్‌కు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News April 17, 2025
మైదుకూరులో రోడ్డు ప్రమాదం

కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన మైదుకూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆది రెడ్డి పల్లె గ్రామ శివార్లలో ఓ బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 17, 2025
అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు: కడప కలెక్టర్

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను ప్రణాళికాబద్ధంగా, బాధ్యతాయుతంగా, నిబద్ధతతో కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయ ఆవరణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.