News April 13, 2025
IPL: షమీని పక్కన పెట్టాల్సిందేనా?

టాప్ క్లాస్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పుడు SRH టీమ్‌కు భారంగా మారారు. అతడు బౌలింగ్‌కు వచ్చాడంటే ఎక్కడ భారీగా పరుగులిస్తాడోనని SRH అభిమానులు భయపడే పరిస్థితి వచ్చింది. నిన్న PBKSతో మ్యాచులోనూ 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 75 రన్స్ ఇచ్చారు. ఈ సీజన్లో 6 మ్యాచులాడిన షమీ 5 వికెట్లే తీశారు. దీంతో తదుపరి మ్యాచ్‌లో అతడిని పక్కనపెట్టి మరో బౌలర్‌ను తీసుకోవడం బెటర్ అనే చర్చ మొదలైంది. ఏమంటారు?
Similar News
News January 13, 2026
రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తామంటే ఊరుకోం: పొంగులేటి

TG: జిల్లాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. అశాస్త్రీయంగా చేసిన జిల్లాలను మళ్లీ శాస్త్రీయంగా మారుస్తామని సీఎం రేవంత్ చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని <<18838995>>అగ్నిగుండంగా<<>> చేస్తామంటే చూస్తూ ఊరుకోమని బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100 పర్సెంట్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
News January 13, 2026
పసుపును ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పసుపును ఉడకబెట్టిన తర్వాత శుభ్రం చేసిన పదునైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ నేలపై కుప్పగా పోయాలి. ఒకరోజు తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. మరీ పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. పరిచిన పసుపును మధ్యాహ్నం సమయంలో తిరగబెడితే సమానంగా ఎండుతాయి. పసుపు దుంపలు లేదా కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. ఈ స్థితికి రావడానికి 18- 20 రోజులు పడుతుంది. రాత్రివేళ టార్పాలిన్లు కప్పాలి.
News January 13, 2026
సంక్రాంతి: ముగ్గులు వేస్తున్నారా?

సంక్రాంతి పండుగకు ముగ్గులు వేయడం మన సంప్రదాయం. అయితే అందులో బియ్యప్పిండి కలపడం ద్వారా చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించిన వాళ్లమవుతాం. పూర్వం ముగ్గులో బియ్యప్పిండి కలిపే వేసేవారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి, పూలతో అలంకరించడం వల్ల ఆ ప్రాంతం మహాలక్ష్మికి నివాసంగా మారుతుందని నమ్మకం. రథాల ముగ్గులు వేయడం వల్ల అమ్మాయిలలో సృజనాత్మకత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.


