News April 13, 2025

అమెరికాలో మాదిరి రోడ్లు నిర్మిస్తాం: నితిన్ గడ్కరీ

image

వచ్చే రెండేళ్లలో రోడ్ల నిర్మాణాల కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యేకించి ఈశాన్య భారతంలోని రహదారులను USAరోడ్ల మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండేళ్లలో భారత్‌ని ప్రపంచంలోని అత్యున్నత మౌలిక సదుపాయాలు కలిగిన దేశంగా అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు. 2014లో 91,287కి.మీ ఉన్న జాతీయ రహదారుల పొడవు ప్రస్తుతం 1,46,204 కి.మీకి పెరిగిందన్నారు.

Similar News

News April 16, 2025

ఇండియన్ రైల్వే‌స్‌కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.

News April 16, 2025

రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారా?

image

AP: బియ్యం పంపిణీ ఆగిపోవద్దంటే లబ్ధిదారులు రేషన్ కార్డు e-KYCని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలి. e-KYC స్టేటస్ కోసం epds1.ap.gov.in <>సైట్‌కు<<>> వెళ్లాలి. డాష్‌‌బోర్డుపై క్లిక్ చేసి, epds అప్లికేషన్ సర్చ్ లేదా రైస్ కార్డ్ సర్చ్‌లో కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. కార్డులోని పేర్ల ఎదురుగా సక్సెస్ లేదా S అని ఉంటే KYC పూర్తయినట్లు. ఒకవేళ లేకపోతే డీలర్/MDU వాహనం వద్ద ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసి KYC పూర్తి చేయాలి.

News April 16, 2025

అమరావతిపై అపోహలు సృష్టించొద్దు: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతిపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. భూములిచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని హామీ ఇచ్చారు. ‘ఇప్పటికే అమరావతిలో పనులు పూర్తయ్యాయి. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటేనే పరిశ్రమలు వచ్చి భూముల ధరలు పెరుగుతాయి. అందుకే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని CM భావించారు’ అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!