News April 13, 2025
ఆ చిన్నారి డ్రింక్స్‌కే పరిమితమా?

మరికాసేపట్లో RCBతో RR తలపడనుంది. ఈ క్రమంలో పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ(RR)కి తుది జట్టులో స్థానం దక్కుతుందా అనేదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వైభవ్‌తో డ్రింక్స్ మోయించడమే కాకుండా మ్యాచులో ఆడించాలని కోరుతున్నారు.
Similar News
News April 16, 2025
ఈ నెల 20న ఆదిలాబాద్‌కు మంత్రి సీతక్క

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఈనెల 20న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లను బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా, ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదివాసీ నేతలతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
News April 16, 2025
రూ. 4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

AP రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి CRDA టెండర్లను ఆహ్వానించింది. 1,2 టవర్ల నిర్మాణానికి రూ.1,897కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.1,664 కోట్లతో టెండర్లను పిలిచింది. వీటితో పాటు HOD ఆఫీసుకు రూ.1,126 కోట్లతో అదనంగా మరో టవర్ నిర్మాణానికీ టెండర్లను పిలిచింది. అటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
News April 16, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించలేం: సుప్రీం

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.