News April 13, 2025

కైలాసపట్నం ఘటన.. కేజీహెచ్‌కు క్షతగాత్రుల తరలింపు 

image

కైలాసపట్నం మందు గుండు సామగ్రి తయారీ కేంద్రం వద్ద పేలుడు జరిగిన స్థలంలో మరో రెండు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతి చెందిన వారిలో ఒకరిని రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మిగా గుర్తించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఇద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. పేలుడు ఎలా జరిగిందో స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. మందు గుండు తయారీ కేంద్రం యజమాని రమేశ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

Similar News

News September 15, 2025

యూరియాను పక్కదారి పట్టించిన గన్‌మెన్ నల్గొండకి అటాచ్..!

image

MLG ఎమ్మెల్యే BLR గన్‌మెన్ నాగునాయక్‌ యూరియాను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఈఘటనపై సీరియస్ అయిన ఎస్పీ నాగు నాయక్‌ను నల్గొండ జిల్లా కేంద్రానికి అటాచ్ చేశారు. విచారణ పూర్తయ్యాక శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News September 15, 2025

ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: CM చంద్రబాబు

image

AP: నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖల మంత్రులకు CM చంద్రబాబు లేఖలు రాశారు. ‘US టారిఫ్స్‌తో ఆక్వా రంగానికి రూ.25 వేల కోట్ల నష్టం జరిగింది. 50 శాతం ఆర్డర్లు రద్దయ్యాయి. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలి. ఆక్వా రుణాల వడ్డీలపై మారటోరియం విధించాలి’ అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.

News September 15, 2025

జూరాలకు ఇన్ ఫ్లో 78,013 క్యూసెక్కులు

image

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం ఉదయం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 78,013 క్యూసెక్కులు వస్తుంది. స్పిల్ వే గేట్ల ద్వారా 32,235 క్యూసెక్కులు, పవర్ హౌస్‌కు 41,513 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 74,344 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.