News April 13, 2025
అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలి: కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 14 వరకు గడువు ఉండటంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం సెలవు అయినప్పటికీ దరఖాస్తుదారులు వచ్చే అవకాశం ఉన్నందున, దరఖాస్తుల కొరత రాకుండా తగినన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు.
Similar News
News January 16, 2026
GHMC రిజర్వేషన్లు ఖరారు.. బీసీలకు 40% స్థానాలు

GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు 122 స్థానాలు కేటాయించారు. పురుషులు, మహిళలకు సమానంగా చెరో 61 సీట్లు ఇచ్చారు. SCలకు 23 (M-12, F-11), STలకు 5 (M-3, F-2) స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 76, అన్రిజర్వుడ్గా 74 స్థానాలు ప్రకటించారు. మొత్తంగా మహిళలకు 150 స్థానాలు దక్కాయి.
News January 16, 2026
భిక్కనూర్: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బిక్కనూరు మండలం జంగంపల్లిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాడి నరసింహులు(53) ఇటీవల కొత్త ఇల్లు నిర్మించగా, అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన, గురువారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.