News April 13, 2025

రేపు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

image

TG: ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి తొలి కాపీని అందించనుంది. ఈ కమిటీలో మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క సహా పలువురు అధికారులు ఉన్నారు.

Similar News

News April 20, 2026

ఆల్కహాల్ అలవాటు లేకపోయినా లివర్ సమస్యలు.. ఎలా?

image

ఆల్కహాల్ అలవాటులేని వారికి లివర్ ప్రాబ్లమ్స్ రావనేది అపోహ మాత్రమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య సిటీల్లో చాలామంది ‘నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్’ (NAFLD) బారిన పడుతున్నారు. గంటల తరబడి కూర్చొని ఉండటం, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్ వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతోంది. బరువు తక్కువగా ఉన్నా ఈ సమస్య రావొచ్చు. దీన్ని ‘లీన్ ఫ్యాటీ లివర్’ అంటారు. వాకింగ్, మంచి ఆహారంతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

News April 20, 2026

ఇండియా ఆఫర్‌ను తిరస్కరించా: రషీద్ ఖాన్

image

భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన సిటిజన్‌షిప్ ఆఫర్లను తాను తిరస్కరించానని రషీద్ ఖాన్ తెలిపారు. ఈ 2 దేశాల తరపున ఆడే అవకాశం వచ్చినా సున్నితంగా వద్దని చెప్పినట్లు తన కొత్త పుస్తకంలో వెల్లడించారు. ‘నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను’ అని చెప్పినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 IPL సమయంలో ఇండియన్ క్రికెట్ బోర్డ్ అధికారి ఒకరు సిటిజన్‌షిప్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు.

News April 20, 2026

ఇరాన్ షిప్‌ను స్వాధీనం చేసుకున్నాం: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిలో తమ దిగ్బంధనాన్ని దాటుకొని వెళ్లేందుకు యత్నించిన ఇరాన్ నౌక ‘టౌస్కా’ను స్వాధీనం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వార్నింగ్స్ ఇచ్చినా వినకపోవడంతో తమ నేవీ రంగంలోకి దిగినట్లు చెప్పారు. తమ USS Spruance డెస్ట్రాయర్ ద్వారా ఇరాన్ షిప్‌ ఇంజిన్‌రూమ్‌పై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తమ స్వాధీనంలో ఉన్న ఆ నౌకలో ఏముందో పరిశీలిస్తున్నట్లు తెలిపారు.