News April 13, 2025

కైలాసపట్నంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే

image

అనకాపల్లి జిల్లా కైలాసపట్నం మందు గుండు తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన వారిలో అప్పికొండ తాతబాబు(50), సంగరాతి గోవిందు(45), దాడి రామలక్ష్మి(38), దేవర నిర్మల(38),పురం పాప(40),గుంపిన వేణుబాబు(40),సేనాపతి బాబురావు(56), మనోహర్ ఉన్నారు. మరికొద్ది సేపటిలో హోం మంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి రానున్నారు.

Similar News

News April 16, 2025

వనపర్తి: నేషనల్ హెరాల్డ్ కేసుపై ధర్నాలు చేయాలి: రాజేంద్రప్రసాద్

image

నేషనల్ హెరాల్డ్‌లో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీపై బీజేపీ, మోదీ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని, AICC, TPCC పిలుపుమేరకు ఏప్రిల్ 17న అన్ని జిల్లా, మండలాలు, మున్సిపాలిటీల్లో వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని DCC అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ఫొటోలు, వీడియోలు పంపాలన్నారు.

News April 16, 2025

ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ గాదె

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులు నాయుడు బుధవారం రాష్ట్ర శాసన మండలి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ కొయ్యా మోషేన్ రాజు శ్రీనివాసులు నాయుడుతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ ప్రతినిధులు అధికారులు ఆయనను అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు.

News April 16, 2025

నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.41,51,973

image

అనకాపల్లి నూకాంబిక అమ్మవారికి 32రోజుల ఆదాయాన్ని బుధవారం దేవస్థాన ఉత్సవ మండపములో లెక్కించారు. నగదుగా రూ.41,51,973ల నగదు, 15.5గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ తెలిపారు. ఈ లెక్కింపులో ఉత్సవ కమిటీ ఛైర్మన్ పీలా నాగశ్రీను, డైరెక్టర్లు పాల్గొన్నారు.

error: Content is protected !!