News April 13, 2025
కైలాపట్నం: మృతదేహాలతో నిండిన పేలుడు ప్రాంతం

కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో మందు గుండు సామాగ్రి తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన భారీ పేలుడు వలన మృతదేహాలు పడి ఉన్నాయి. వెతికే కొద్దీ మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ హృదయ విచార ఘటన స్థానికులను, చుట్టుపక్కల ప్రాంతాల వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యుల బాధకు అంతులేకుండా పోయింది. సంబంధిత అధికారులు వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News November 1, 2025
వనపర్తి: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

పెండింగ్ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ సరైన వేదిక అని వనపర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీస్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ నెల 15న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా ఇరువర్గాలకు అవగాహన కల్పించాలని సూచించారు.
News November 1, 2025
అక్షతలు తలపైన వేసుకుంటే…

శాస్త్రం ప్రకారం.. అక్షతలు శుభాన్ని సూచిస్తాయి. అందుకే శుభ కార్యాల్లో, పండుగలప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అక్షతలను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలో వాడిన అక్షతలను దాచుకుని, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాటిని తలపైన వేసుకోవాలట. ఇలా చేస్తే చేయాలనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం.
News November 1, 2025
ఓల్డ్ గూగుల్ క్రోమ్ వాడుతున్నారా?

ఓల్డ్ వెర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని CERT-In హెచ్చరికలు జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని, దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని తెలిపింది. లైనక్స్, విండోస్, macOSలో 142.0.7444.59/60 కంటే ముందున్న వెర్షన్లు వాడుతుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.


