News April 13, 2025
నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం

ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యానంలో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 12, 13వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు మొదటి, పశ్చిమగోదావరి జిల్లాకు రెండవ, నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం వచ్చింది. రూ.5000 బహుమతి అందుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఓబులం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 16, 2025
41 రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీ: జేసీ కార్తీక్

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.
News April 16, 2025
NLR: యువతిని బెదిరించి చైన్ దోచుకెళ్లాడు

ఓ యువతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగింది. బాలాజీనగర్ పోలీసుల సమాచారం మేరకు..మర్రిపాడుకు చెందిన రీమాశేఖర్ నారాయణ వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ స్నేహితుడితో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి బెదిరించి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు.
News April 16, 2025
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 107 పోస్టుల మంజూరు

రాష్ట్రంలోని 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కొత్తగా 107పోస్టులు రానున్నాయి. వీటిలో 63 ఎస్‌జీటీ, 44 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 105 స్కూల్ అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా గతంలోనే 61 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 44 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.