News April 13, 2025

తొక్కిసలాట వెనుక భూమన హస్తం: బీఆర్ నాయుడు

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ తొక్కిసలాట వెనుక వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డిల హస్తం ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘గోవుల మృతిపై భూమన మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేశారు. భూమనకు ఈ ఫొటోలను గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇచ్చారు. ఈ విషయంలో భూమనపై క్రిమినల్ కేసు పెడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News April 16, 2025

ఈ నెల 20న BJP జాతీయ అధ్యక్షుడి ప్రకటన?

image

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెల 20న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి రేసులో మోహన్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 18, 19 తేదీల్లో పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నట్లు సమాచారం.

News April 16, 2025

రేపు ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్స్ ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. B.E, B.Techలో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు అన్సర్ కీతో పాటు ఫలితాలను రేపు తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో B.E, B.Tech ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9న బీఆర్కే, బీప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించారు.
వెబ్‌సైట్: <>jeemain.nta.nic.in<<>>

News April 16, 2025

కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట

image

మహారాష్ట్ర Dy.CM శిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్ కునాల్ కమ్రాను పోలీసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయొద్దని కోరుతూ బాంబే హైకోర్టును కమ్రా ఆశ్రయించగా కోర్టు తాత్కాలికంగా ఊరటనిచ్చింది. తీర్పును రిజర్వ్ చేశామని, అప్పటి వరకు కునాల్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసుల్ని ఆదేశించింది.

error: Content is protected !!