News April 13, 2025

రెంటచింతలలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత 

image

రెంటచింతల పరిసర ప్రాంతాలలో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 40.4 డిగ్రీలుగా నమోదు అయినట్లు జంగమహేశ్వరంలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం నుంచే రెంటచింతల పరిసర ప్రాంతాల్లోని గ్రామాలలో ఎండ నిప్పుల కొలిమిని తలపించింది. గ్రామాలలో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆకాశం మేఘావృతం అయింది. సాయంత్రానికి 27.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News April 16, 2025

IPL: ఢిల్లీ స్కోర్ ఎంతంటే?

image

రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ 20 ఓవర్లలో 188/5 రన్స్ చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 49 రన్స్ చేసి ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ మిస్ అయ్యారు. గత మ్యాచులో అదరగొట్టిన కరుణ్ నాయర్‌ను ఈసారి దురదృష్టం వెంటాడింది. ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యారు. అక్షర్ కెప్టెన్ ఇన్నింగ్స్(34) ఆడగా, రాహుల్ 38, స్టబ్స్ 34* రన్స్‌తో రాణించారు. RR బౌలర్లలో ఆర్చర్ 2, తీక్షణ, హసరంగా తలో వికెట్ తీశారు.

News April 16, 2025

ఈ నెల 20న BJP జాతీయ అధ్యక్షుడి ప్రకటన?

image

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఈ నెల 20న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసంలో సమావేశమయ్యారు. అధ్యక్ష పదవి రేసులో మోహన్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 18, 19 తేదీల్లో పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించనున్నట్లు సమాచారం.

News April 16, 2025

సంగారెడ్డి: భూభారతిపై అవగాహన పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 17 నుంచి 30 వరకు భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు రైతులను పిలిచి భూభారతి చట్టం గురించి పూర్తిస్థాయిలో వివరించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్, అదనపు కలెక్టర్ మాదిరి పాల్గొన్నారు.

error: Content is protected !!