News April 13, 2025
క్షిపణి దాడిలో 31 మంది మృతి

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంపై రష్యా సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 31 మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, 84 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకుండా రష్యా దాడులను ఖండించాలని ఆయన కోరారు. రష్యాపై బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుందని అన్నారు.
Similar News
News April 16, 2025
రేపు ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్స్ ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. B.E, B.Techలో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు అన్సర్ కీతో పాటు ఫలితాలను రేపు తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో B.E, B.Tech ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9న బీఆర్కే, బీప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించారు.
వెబ్సైట్: <
News April 16, 2025
కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట

మహారాష్ట్ర Dy.CM శిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్ కునాల్ కమ్రాను పోలీసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయొద్దని కోరుతూ బాంబే హైకోర్టును కమ్రా ఆశ్రయించగా కోర్టు తాత్కాలికంగా ఊరటనిచ్చింది. తీర్పును రిజర్వ్ చేశామని, అప్పటి వరకు కునాల్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసుల్ని ఆదేశించింది.
News April 16, 2025
మరోసారి నిరాశపరిచిన ‘మెక్‌గర్క్’

ఢిల్లీ బ్యాటర్ మెక్‌గర్క్ మరోసారి నిరాశపరిచారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్నట్లు కనిపించినా 9 పరుగులకే ఔటయ్యారు. ఈ సీజన్లో 6 ఇన్నింగ్సుల్లో 55 పరుగులే చేశారు. ఇందులో అత్యధికం 38 రన్స్. గత ఏడాది 9 ఇన్నింగ్సుల్లో 330 పరుగులు చేసిన ఈ హిట్టర్ ఈ సారి తేలిపోతున్నారు. మరి తర్వాతి మ్యాచుల్లోనైనా ఫామ్ అందుకొని ఢిల్లీకి శుభారంభం అందిస్తారో లేదో వేచిచూడాలి.