News April 13, 2025

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విజయ్ పిటిషన్

image

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళ సినీ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని, దీనిని వెనక్కి తీసుకోవాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చట్టానికి రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈనెల 16న ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Similar News

News February 21, 2026

వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు.

News February 21, 2026

రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ రెండో వివాహం చేసుకున్నారు. ఐర్లాండ్‌కు చెందిన ప్రేయసి సోఫీ షైన్‌తో ఇవాళ ఏడడుగులు వేశారు. ఈ జంటకు అభిమానులు, తోటి క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News February 21, 2026

667 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>మహానది <<>>కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ 667 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా(మైనింగ్, పాథాలజీ), డిగ్రీ(మైనింగ్ Engg., మైనింగ్ సర్వేయింగ్ Engg.), ఓవర్‌మెన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, BA అర్హత గలవారు మార్చి 16 -ఏప్రిల్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: mahanadicoal.in