News March 27, 2024

జగిత్యాలలో మత్తులో మైనర్ల హంగామా!

image

జగిత్యాలలోని మహాలక్ష్మినగర్ బైపాస్ దగ్గర మంగళవారం సాయంత్రం మత్తులో ఉన్న నలుగురు మైనర్లు హంగామా సృష్టించారు. విచిత్రంగా ప్రవర్తిస్తూ ఇళ్ల ముందు నిలిపిన బైకులను తన్ని కింద పడేశారు. కేకలు వేస్తూ రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారికి ఫిర్యాదు చేయగా వారిని పట్టుకోవడానికి వచ్చిన సిబ్బందిపై దాడికి యత్నించారు. ఒకరిని పట్టుకోగా ముగ్గురు పారిపోయారు.

Similar News

News March 22, 2026

కరీంనగర్: ‘హృదయవిదారక చిత్రం’

image

శంకరపట్నం మండలం అంబేడ్క‌ర్ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన మూడేళ్ల చిన్నారి నిత్య దహన సంస్కారాలు ఆదివారం నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చేతుల మీదుగా పాప మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లడం అందరినీ కలచివేసింది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు జరగగా, తల్లిదండ్రుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

News March 21, 2026

KNR: లగ్జరీ బస్సులో వాటర్ బాటిల్ బంద్

image

ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, డిలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అందిస్తున్న జీవ (500 ML) వాటర్ బాటిళ్ల సరఫరా బంద్ చేశారు. కానీ వాటర్ బాటిల్‌కు టికెట్ ఛార్జీలో రూ.10 ఛార్జి వడ్డించడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఉన్నతాధికారులు స్పదించి కరీంనగర్ రీజియన్ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్ సరఫరా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.