News April 13, 2025
కర్నూలు: పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం రద్దు

డా.బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదివారం తెలిపారు. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News April 16, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ మాదక ద్రవ్య మోసాలపై QR కోడ్: కర్నూలు SP
➤ ఎమ్మిగనూరులో YCP నుంచి TDPలోకి చేరికలు
➤ కర్నూలు TDP కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు
➤ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం
➤ కోడుమూరు: ముగ్గురు వీఆర్వోలపై బదిలీవేటు
NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.
News April 16, 2025
కర్నూలు: మాదక ద్రవ్య మోసాలపై QR కోడ్

కర్నూలు జిల్లాలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పేర్కొన్నారు. ఆయా మండలాల్లోని పోలీసు స్టేషన్‌లలో పబ్లిక్ ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేసి, వాటిని స్కాన్ చేసి డ్రగ్స్ సంబంధించిన సమాచారం తెలపాలని ప్రజలను కోరుతున్నారు.
News April 16, 2025
నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్.. నిందితుడి అరెస్ట్

డబ్బు కోసం యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్‌ను అరెస్టు చేసినట్లు ఆలమూరు SI అశోక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ యాప్ ద్వారా యువతి పరిచయమైందని తెలిపారు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో స్క్రీన్ షాట్స్ తీసి మూడు ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.