News April 13, 2025
బాలానగర్ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

బాలానగర్లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్లో ఉన్న వెహికిల్ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 7, 2026
VJA: లోకల్కే పెద్దపీట.. సంక్రాంతికి 6వేల RTC సర్వీసులు.!

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని RTC కీలక నిర్ణయం తీసుకుంది. 8,432 ప్రత్యేక సర్వీసుల్లో 6వేల బస్సులను రాష్ట్రంలోని లోకల్ రూట్లలోనే నడపనుంది. ‘స్త్రీశక్తి’ పథకంతో పెరిగిన రద్దీ దృష్ట్యా స్థానిక ప్రాంతాలకు పెద్దపీట వేసింది. HYD, బెంగళూరు, చెన్నైల నుంచి వందలాది బస్సులు నడుపుతున్నా, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల ద్వారా గ్రామీణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారు.
News January 7, 2026
వేములవాడ బద్ది పోచమ్మ ఆలయం వద్ద క్యూలైన్ల ఏర్పాటు

వేములవాడ బద్ది పోచమ్మ ఆలయం వద్ద క్యూలైన్లను తిరిగి ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఉన్న క్యూలైన్ల అడుగు భాగంలో కొత్తగా సీసీ ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు. ఈ పనుల కోసం ఆ ప్రాంతంలో క్యూ లైన్లను తాత్కాలికంగా తొలగించారు. సీసీ ఫ్లోరింగ్ పనులు పూర్తి కావడంతో ఆలయ అధికారులు క్యూ లైన్లను తిరిగి ఏర్పాటు చేసి పందిళ్లు వేశారు. మరోవైపు బద్ది పోచమ్మ వీధి ప్రాంతంలో కొత్తగా చలువ పందిల్లు వేస్తున్నారు.
News January 7, 2026
తంగళ్లపల్లి: ‘చిల్డ్రన్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి’

చిల్డ్రన్ హోం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి పరిధిలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆద్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం నిర్మాణ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ ప్లాన్, పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.


