News March 27, 2024
IPL: SRHకు బ్యాడ్‌న్యూస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక స్పిన్నర్ వనిందు హసరంగా ఇప్పట్లో జట్టులో చేరేలా కనిపించడంలేదు. మడమ నొప్పి కారణంగా తొలి మ్యాచుకు అందుబాటులో లేకుండాపోయిన అతడు.. ఇవాళ ముంబైతో జరగనున్న మ్యాచుకూ దూరం కానున్నారు. వైద్యుల ధ్రువీకరణ తర్వాతే హసరంగా మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అందుకు మరో వారం పట్టనుంది. అయితే మడమ నొప్పి తగ్గకపోతే అతడు టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది.
Similar News
News January 20, 2026
రేపటి నుంచి JEE మెయిన్స్

TG: JEE మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉ.9 గం.-మ.12 వరకు, మ.3గం.-సా.6 వరకు 2 సెషన్స్ ఉంటాయి. HYD, SEC, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సహా రాష్ట్రంలో 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 40వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
News January 20, 2026
మాఘ మాసంలో చేయాల్సిన పూజలివే..

మాఘ మాసంలో నారాయణుడిని, శివుడిని పూజించాలి. వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని, రథసప్తమి నాడు సూర్యుడిని, భీష్మ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం శ్రేష్టం. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో శివార్చన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూజలతో పాటు శక్తి కొలది నువ్వులు, బెల్లం, ఉప్పు, వస్త్రాలను దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుందని పురాణాల వాక్కు. ఆదివారం సూర్యారాధన చేయాలి.
News January 20, 2026
చలికాలం.. పంటలో పురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

చలికాలంలో పంటలో పురుగుల ఉద్ధృతిని తగ్గించడానికి ఎకరా పొలానికి 25 నీలిరంగు, 10 పసుపు రంగు జిగురు అట్టలను అమర్చాలి. దీంతో పురుగులు ఆ అట్టలకు అతుక్కొని చనిపోతాయి. పొలంపై కలుపును తొలగించాలి. తోట చుట్టూ 3-4 వరుసల్లో జొన్న, మొక్కజొన్న పంటలను వేయాలి. ఇవి బయట నుంచి వచ్చే పురుగుల నుంచి పంటను కాపాడతాయి. పంట పూతను కాపాడటానికి పూలపై వేపనూనే స్ప్రే చేయాలి. ఇవి చేదుగా ఉండటం వల్ల పురుగులు పువ్వుల జోలికి రావు.


