News April 14, 2025

ఎన్టీఆర్: రేపటి నుంచి మొదలుకానున్న దరఖాస్తు ప్రక్రియ

image

SC సామాజికవర్గానికి చెందినవారికి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌కై SC కార్పొరేషన్ ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాలకు అర్హులైనవారు అప్లై చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మిశ సూచించారు. 21- 50 సంవత్సరాలలోపు వారు నిర్ణీత ధ్రువపత్రాలు జతచేసి https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 14 నుంచి మే 10లోపు అప్లై చేసుకోవాలని ఆయన తెలిపారు. 

Similar News

News July 6, 2025

సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు

image

సంగారెడ్డి జిల్లా ఎంపీడీఓ సుధాకర్, మాల్సుర్ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇతర జిల్లాలో పని చేస్తున్న చంద్రశేఖర్, మంజుల, శారద దేవీ జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీఓలు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.

News July 6, 2025

ప్రేమజంట ఆత్మహత్య!

image

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

నేడు మంగళంపల్లి జయంతి

image

నేడు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి. రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తంలో 1930 జులై 6న జన్మించిన బాలమురళీకృష్ణ, తన అసాధారణ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గాయకుడిగా, స్వరకర్తగా, వాగ్గేయకారుడిగా ఆయన సంగీత లోకానికి అందించిన సేవలు అనన్యసామాన్యం. ఆయన పాడిన పాటల్లో ఈ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి.