News April 14, 2025
అశ్వవాహనంపై కోదండరాముడు

AP: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ రాత్రి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అంతకుముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అలరించారు. అశ్వవాహనంపై స్వామిని చూస్తూ భక్తులు శ్రీరామనామ స్మరణలతో పరవశించిపోయారు.
Similar News
News April 17, 2025
ఈ రీజనింగ్ పజిల్‌కు ఆన్సర్ తెలుసా?

పై ఫొటోలో ఉన్న రీజనింగ్ పజిల్లో బోట్, రింగ్, స్టార్‌కు ఒక్కో దానికి ఒక్కో నంబర్ కేటాయించారు. దాని ఆధారంగా కుడివైపు ఆన్సర్ ఇస్తూ వచ్చారు. తొలి మూడింటి ఆధారంగా 4, 5వ దాని సమాధానాలు కనుక్కొని COMMENT చేయండి.
News April 17, 2025
క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకోగా ప్రెగ్నెన్సీ కారణాలతో ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఛాన్స్‌ను యంగ్ హీరోయిన్ శార్వరీ దక్కించుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముంజ్య, ఆల్ఫా మూవీలతో శార్వరీ లైమ్ లైట్లోకి వచ్చారు.
News April 17, 2025
ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం

బీజేపీ సంస్థాగత ఎన్నికలపై ఆ పార్టీ అగ్రనేతలు PM మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో జాతీయ అధ్యక్షుడి, పలు రాష్ట్రాలకు చీఫ్‌లను ఎన్నుకునే ప్రక్రియపై చర్చించినట్లు తెలుస్తోంది. APR 20 తర్వాత ఎప్పుడైనా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అటు, రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు రెండు, మూడ్రోజుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం.