News April 14, 2025
SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు రేపు రద్దు

శ్రీకాకుళంలోని జడ్పీ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రేపు సోమవారం నిర్వహించడం లేదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేశామని చెప్పారు. ప్రజలంతా గమనించాలని కోరారు.
Similar News
News April 16, 2026
శ్రీకాకుళం: సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20 వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులు సూచించారు. రీ వెరిఫికేషన్ కు సైతం 20 వ తేదీ 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 16, 2026
విధిని వెక్కిరించిన సిక్కోలు విద్యార్థి

పలాసకు చెందిన సకల భక్తుల వంశీకి పుట్టుకతోనే చేతులు, కాళ్లు సహకరించని పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు 972 మార్కులు సాధించారు. తండ్రి లక్ష్మణరావు చిరు వ్యాపారి, తల్లి పార్వతి గృహిణి. స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చదివించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, టీచర్స్ , స్నేహితుల సహకారం మరువలేనిదని వంశీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
News April 15, 2026
శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.


