News April 14, 2025
రామచంద్రపురం: 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఈనెల 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రామచంద్రపురంలోని మూల్యాంకణ కేంద్రం వద్ద పరీక్ష ఏర్పాట్లపై ఆదివారం సమావేశం నిర్వహించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి పాల్గొన్నారు.
Similar News
News March 20, 2026
విశాఖ: నగర బహిష్కరణ చేసినా.. హత్యకు పాల్పడ్డాడు

విశాఖలోకి ఇసుకతోట రామాలయం వీధిలో రౌడీ షీటర్ పల్లా అనీల్ చేతిలో వెంకటేశ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడిన <<19422500>>అనీల్<<>>కు నేర చరిత్ర ఉండడంతో గతంలోనే పోలీసులు నగర బహిష్కరణ చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉంటున్నాడు. పాతకక్షల నేపథ్యంలో అనీల్ రణస్థలం నుంచి కొందరిని తీసుకువచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో వెంకటేశ్ సోదరుడు సంతోష్ గాయపడి చికిత్స పొందుతున్నాడు.
News March 20, 2026
పర్యాటకానికి ‘బడ్జెట్’ ఊతం ఇచ్చేనా?

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగానికి మహర్దశ పడుతుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక కారిడార్ అభివృద్ధికి, భద్రాద్రి, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాల ఆధునీకరణకు సుమారు రూ. 500 కోట్లు అవసరమని అంచనా. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా ఇప్పుడే నిధులు కేటాయిస్తేనే ఘాట్లు, రహదారుల పనులు సకాలంలో పూర్తవుతాయి.
News March 20, 2026
ఇంద్రకీలాద్రిపై సిబ్బంది కొరత.. భక్తుల సేవలకు ఆటంకం!

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా, అందుకు తగ్గట్టుగా సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. గత 20ఏళ్లుగా కొత్త నియామకాలు లేవు, ఉన్నవారు పదవీ విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం ఉన్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలు సరిపోవడం లేదు. కనీసం 100 మంది కొత్త సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.


