News April 14, 2025
రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ రద్దు

రంపచోడవరంలో సోమవారం నిర్వహించవలసిన గ్రీవెన్స్‌ని రద్దు చేశామని ITDA. PO. సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వం కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. దీంతో గ్రీవెన్స్ రద్దు అయ్యిందని తెలిపారు. రంపచోడవరం డివిజన్‌లో ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు.
Similar News
News March 11, 2026
ఒంటిమిట్ట: మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొంటారు.
News March 11, 2026
VKB: అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలి: కలెక్టర్

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో 99రోజుల ప్రగతి ప్రణాళికపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజాపాలన కార్యక్రమాలను నిర్వహించి అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
News March 11, 2026
VZM: కేంద్రీయ విద్యాలయంలో జాతీయ సదస్సు ప్రారంభం

విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సుస్థిర రసాయన శాస్త్రం–2026” అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. సదస్సులో సుస్థిర రసాయన పరిశోధనల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై పలువురు శాస్త్రవేత్తలు వివరించారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.


