News April 14, 2025
డోర్నకల్, భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్-భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. 2008లో ప్రారంభమైన ప్రతిపాదనలు పలు కారణాలతో ఆగిపోయాయి. ఈ లైన్‌తో దూరం తగ్గడంతో పాటు గూడ్స్ రవాణా, హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైల్వేశాఖ అధికారులు డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపారు.
Similar News
News November 15, 2025
గద్వాల: ‘పల్లెటూరి కుర్రాళ్లను’ అభినందించిన ఎస్పీ

రోడ్డు భద్రతపై షార్ట్ ఫిల్మ్ రూపొందించిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’ గ్రూప్ సభ్యులు ఖదీర్, దేవేందర్, హరిప్రసాద్, రాజు, పరుశురాంలను గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు శనివారం అభినందించారు. వారి ఫిల్మ్ వాస్తవానికి దగ్గరగా ఉందని కొనియాడారు. షార్ట్ ఫిల్మ్ చూసిన వారందరూ ట్రిపుల్ రైడింగ్, మత్తు జోలికి వెళ్లకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.
News November 15, 2025
వంటింటి చిట్కాలు

* ఇన్‌స్టంట్ కాఫీపొడిని గాలి తగలని డబ్బాలో వేసి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచితే ఎంత కాలమైనా గడ్డ కట్టదు.
* కోడిగుడ్డు సొనలో కొద్దిగా నీళ్లు కలిపి వేస్తే ఆమ్లెట్ మెత్తగా వస్తుంది.
* స్టీల్ గ్లాస్‌లు, గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయినపుడు పై గ్లాసును చల్లటి నీటితో నింపి, వేడినీటిలో ఉంచితే ఈజీగా వచ్చేస్తాయి.
* పాస్తా ముద్దలా అవ్వకూడదంటే ఉడికించేటపుడు చెక్క స్పూన్/ ఫోర్క్ వేస్తే సరిపోతుంది.
News November 15, 2025
HYD: హడలెత్తిస్తున్న సైబర్ మోసాలు

మనుషుల ప్రాణాలను సమస్త లోకాలకు పంపుతున్న సైబర్ నేరాలు ఇప్పుడు కొత్త దారులు వెతుకుతోంది. సైబర్ అంటేనే ప్రస్తుతం గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. మాయమాటలు చెప్పి మత్తెకించి వేలిముద్రలు తీసుకుంటున్నారు. HYDలో ప్రతీ విషయం పట్ల జాగ్రత్త పడాలని పోలీసులు సూచించారు. ఇన్ని రోజులు దొంగలు పడితే భయపడేవారు కానీ..ఇప్పుడు మొబైల్, ఎకౌంట్లో దొంగలు పడుతున్నారు.


