News April 14, 2025

అనంతపురంలో పోలీసుల అవగాహన సదస్సు

image

జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురంలోని మూడవ పట్టణ పోలీసులు రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్‌తో వాహనాలు వెళ్ళకూడదన్నారు. డ్రంకెన్ డ్రైవ్ చేయరాదన్నారు.

Similar News

News April 18, 2025

కేంద్ర మంత్రికి ఎంపీ అంబికా ప్రశంస 

image

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్-2025గా ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తిగా ఆయనకు వచ్చిన ఈ అంతర్జాతీయ గుర్తింపు.. మన రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణమన్నారు. శ్రమ, సమర్ధత, విజన్ కలిగిన యువ నాయకుడు రామ్మోహన్ అని ఎంపీ ప్రశంసించారు.

News April 18, 2025

పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో అన్ని పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలని, ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మీటింగ్ & డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కమిటీ మీటింగ్‌లను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమలలో ప్రమాదకర రసాయనాలపై కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు.

News April 18, 2025

‘గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి’

image

అనంతపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ భవనంలో గురువారం సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల తెగల వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

error: Content is protected !!