News April 14, 2025

కృష్ణా: ర్యాలీల నిర్వహణకు అనుమతి లేదు- డీఎస్పీ

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లాలో బైక్ ర్యాలీలు, డీజే సౌండ్ బాక్స్‌లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మచిలీపట్నం డీఎస్పీ రాజా పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరాలతో నిశితంగా పర్యవేక్షిస్థామన్నారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News April 18, 2025

కృష్ణా: విద్యార్థి మృతదేహం లభ్యం

image

ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన విద్యార్థి ప్రత్తిపాటి పవన్ సమిత్ (15) గురువారం సాయంత్రం కేఈబీ కెనాల్‌లో స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్ఐ కె.ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కెఈబీ కెనాల్ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా చల్లపల్లి మండలం వెలివోలు కుమ్మరిపాలెం వద్ద శుక్రవారం పవన్ మృతదేహం లభ్యమైనది. ఈ సంఘటనతో పాపవినాశనంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 18, 2025

బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

image

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

News April 18, 2025

ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

image

 ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

error: Content is protected !!