News April 14, 2025

‘కేజీహెచ్‌లో అందుబాటులో అన్నిరకాల మందులు’

image

కేజీహెచ్‌లో రోగులకు అందుబాటులో అన్ని రకాల మందులు ఉన్నాయని సూపరింటెండెంట్ శివానంద్ ఆదివారం తెలిపారు. కెజీహెచ్‌లో రూ.1.5 కోట్ల విలువ గల అన్ని రకాల మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రోగులకు అందుబాటులో తీసుకువచ్చామన్నారు. రోగులకు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ మందులను వారం రోజులకు సరిపడనట్లు ఇస్తున్నామన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు 90 రోజులకు సరిపడే విధంగా మందులు ఇస్తున్నామన్నారు. 

Similar News

News March 28, 2026

విశాఖ: డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడు బాధ్యతలు

image

విశాఖ జిల్లా డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడును ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు విశాఖ జిల్లా అభివృద్ధిలో భాగస్వామినవుతానని పేర్కొన్నారు.

News March 28, 2026

విశాఖలో రక్తమోడుతున్న రహదారులు

image

విశాఖ రోడ్లు రక్తమోడుతున్నాయి. జిల్లాలో 2025లో 1,110 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 340 మంది మృతి చెందారు. లారీలు, ట్యాంకర్ల వల్ల 140 ప్రమాదాల్లో 80 మంది చనిపోగా 104 మంది గాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులు 43 నమోదై, 25 మంది మృతిచెందగా 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలు 4% తగ్గినా మరణాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

News March 27, 2026

విశాఖ: గ్యాస్ బుకింగ్ చేస్తే 8 రోజులు వెయిటింగ్

image

విశాఖ జిల్లాలో HPCL, BPCL, IOCL కలిపి 62 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సుమారు 8.50 లక్షల గృహ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 22 వేలకుపైగా సిలిండర్లు ఏజెన్సీలకు పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇంకా 1.70 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉన్నారు. రోజుకు 20 వేల సిలిండర్లు సరఫరా చేసినా పెండింగ్ పూర్తిగా క్లియర్ కావడానికి కనీసం 8 రోజులు పట్టే పరిస్థితి నెలకొంది.