News April 14, 2025
రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: నాగజ్యోతి

మంగపేట మండలం మోట్లగూడెంకు చెందిన నర్సింహారావు కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నాగజ్యోతి డిమాండ్ చేశారు. నరసింహరావు మృతదేహాన్ని నాగజ్యోతి పరామర్శించి, మాట్లాడుతూ.. ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతోనే రైతు నరసింహారావు మనస్తాపంతో పురుగుమందు తాగి మృతి చెందాడన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 11, 2025
రూ.6.65 లక్షల కోట్లకు ఇళ్ల అమ్మకాలు: అనరాక్

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినా వాల్యూ పరంగా మాత్రం సగటు అమ్మకం విలువ 7% పెరిగిందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. ప్రస్తుత FYలో తొలి ఆరు నెలల్లో రూ.2.98 లక్షల కోట్ల విలువైన 1.93 లక్షల ఇళ్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఇదే జోరులో మార్చి ముగిసే సమయానికి అమ్మకాల విలువ రూ.6.65 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. HYDలో ఇళ్ల మార్కెట్ జోరుగా ఉందని బిల్డర్లు చెబుతున్నారు.
News November 11, 2025
KMR: పంజా విసురుతున్న చలి

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. కామారెడ్డి జిల్లాలో నేటి ఉదయం అత్యంత తీవ్రమైన చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 12°C వరకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నుంచి ఉదయం వేళ, రాత్రి పూట చలి తీవ్రత అధికంగా ఉంటుందని చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 11, 2025
యాదాద్రి: కోతుల సమస్యపై కార్టూన్‌తో ప్రభుత్వం, కోర్ట్‌కు విజ్ఞప్తి!

బడి, బస్సు, రైల్వేస్టేషన్, ఆటస్థలం, జనావాసాల్లో కుక్కలను కట్టడి చేయాలని రాష్ట్రాలకు సుప్రీం కోర్ట్ ఆదేశించిన విషయం తెలిదిందే. అయితే కోతుల సమస్యను ఎత్తి చూపుతూ రామన్నపేటకు చెంది కవి, టీచర్, కార్టూనిస్ట్ పాల్వంచ హరికిషన్ వేసిన కార్టూన్ ఆలోచింపజేస్తుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కోతులు తీవ్రంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని వ్యంగ్య చిత్రంతో కోరారు. సహృదయంతో నిర్ణయం తీసుకోవాలన్నారు.


