News April 14, 2025

అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయండి: ADB కలెక్టర్

image

ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఫైర్ ఆఫీసర్ జైత్రాం, యస్దాని, సంగాన్న, తదితరులు ఉన్నారు.

Similar News

News January 9, 2026

మావల: నకిలీ పత్రాలతో భూ కబ్జా.. నిందితుడి అరెస్టు

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి పత్రాలు నకిలీ చేసి అక్రమంగా స్థలం ఆక్రమించిన కేసులో ప్రధాన నిందితుడు దుర్వ నాగేశ్‌ను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్ర స్వామి తెలిపారు. నకిలీ అమ్మకపు ఒప్పంద పత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న సహ నిందితురాలి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. అమాయకుల వద్ద రూ.కోట్ల విలువైన భూమిని కబ్జాకు ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News January 8, 2026

ఆదిలాబాద్: విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలుకల్పించాలి: కలెక్టర్

image

నార్నూర్ ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంగ్లీష్ ఫౌండేషన్ అభ్యాసన నైపుణ్యాలు, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్ల భాషపై పట్టు సాధించడం ఎంతో అవసరమన్నారు.

News January 8, 2026

PDSU రాష్ట్ర కార్యవర్గంలో ఆదిలాబాద్ వాసులకు చోటు

image

వరంగల్‌లో PDSU రాష్ట్ర 23వ మహాసభలో నిర్వహించారు. ఇందులో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మడావి గణేశ్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా దీపలక్ష్మీలను ఎన్నుకున్నారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి PDSU పక్షాన పోరాడుతామని వారు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.