News April 14, 2025
ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం: మంత్రి

ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటారంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 2005 మహిళా సంఘాలకు రూ.3,12,64,235 చెక్కును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పంపిణీ చేశారు. రూ.కోటితో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Similar News
News April 17, 2025
విజయవాడ వంశీ బెయిల్ పిటిషన్‌పై (UPDATE)

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై నేడు విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా వంశీ ఇదే కేసులో విజయవాడ సబ్ జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
News April 17, 2025
గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా

సౌతాఫ్రికాలో జరిగిన ఇన్విటేషనల్ ఈవెంట్‌లో ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సత్తా చాటారు. 84.52 మీటర్ల జావిలింగ్ త్రో విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. మెుత్తంగా ఆరుగురు పోటీపడ్డ ఈ ఇన్విటేషనల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచారు. వచ్చే నెలలో దోహా డైమండ్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా తన సీజన్‌ను విజయంతో ప్రారంభించారు.
News April 17, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.