News April 14, 2025
ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా ఆర్సీబీ!

IPL 2025లో RCB తన ప్రత్యర్థులను సొంత మైదానాల్లోనే ఓడించి వారి పాలిట సింహస్వప్నంలా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈడెన్‌లో KKR, చెపాక్‌లో CSK, వాంఖడేలో MI, జైపూర్‌లో RRను మట్టికరిపించింది. అన్ని విభాగాల్లో రాణిస్తూ తమకు ఎదురే లేకుండా నిలుస్తోంది. కానీ తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీ ఇంకా ఖాతా తెరవకపోవడం విశేషం. అక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.
Similar News
News September 16, 2025
అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే

ఏపీలో ఐకానిక్ <<17619158>>వంతెన<<>> నమూనాను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 4 నమూనాలను వెబ్‌సైట్‌లో ఉంచగా అత్యధిక ఓటింగ్(14వేలకు పైగా ఓట్లు) వచ్చిన రెండో డిజైన్‌ను సెలక్ట్ చేశారు. రూ.2,500CR వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ వంతెన రాకతో హైదరాబాద్-అమరావతి మధ్య 35kmల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ నమూనాను కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమ ఆధారంగా తీసుకున్నారు.
News September 16, 2025
ప్రసారభారతిలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/
News September 16, 2025
రేబిస్‌తో చిన్నారి మృతి

AP: గుంటూరు(D) పొన్నూరు (M) వెల్లటూరులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తాడిశెట్టి కార్తీక్(5) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గత నెల 22న కుక్కలు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని పలు ఆస్పత్రుల్లో చూపించారు. 3రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా రేబిస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స కోసం GNT ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.