News April 14, 2025

సిద్దిపేట: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దు: సీపీ

image

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హెచ్చరించారు. IT చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు SMలో తప్పుడు పోస్టులు పెట్టవద్దన్నారు.

Similar News

News April 17, 2025

పార్వతీపురం: 24 గంటల్లో 103 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24 గంటల్లో 103 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా మక్కువ మండలంలో 22.6, గరుగుబిల్లిలో 18.6, పార్వతీపురంలో 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. సాలూరు, జియమ్మవలస, కురుపాం, వీరఘట్టం మండలాల్లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సగటున 6.9 MM వర్షం కురిసనట్లు ధ్రువీకరించారు.

News April 17, 2025

ఖమ్మం: పోలీస్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో చెక్కును అందజేసిన సీపి

image

ఖమ్మం పట్టణంలోని ట్రాఫిక్ స్టేషన్లో ఏఎస్ఐ‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ షౌకత్ అలీ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ కమిషనరేట్‌లో ఏఎస్ఐ షౌకత్ అలీ కుటుంబానికి మంజూరు అయిన రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియో చెక్కును బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News April 17, 2025

అందంగా ఉంటేనే అవకాశాలు రావు: తమన్నా

image

అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయనడం తనకు నచ్చదని హీరోయిన్ తమన్నా అన్నారు. అందంపై శ్రద్ధ ఉండాలి కానీ, అదే సినిమా ఛాన్సులు తీసుకువస్తుందంటే తాను నమ్మనని చెప్పారు. ‘‘మిల్కీ బ్యూటీ’ ట్యాగ్ నాకు ఫ్యాన్స్ ఇచ్చారు. దీనిని మీడియా మరింత ప్రచారం చేసింది. ఈ ట్యాగ్ వల్ల నా సినిమాల ఛాయిస్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా తమన్నా నటించిన ‘ఓదెల 2’ ఇవాళ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.

error: Content is protected !!