News April 14, 2025
ఎలక్ట్రానిక్ వస్తువులపై US కొత్త టారిఫ్‌లు?

US అధ్యక్షుడు ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇచ్చిన టారిఫ్‌ల మినహాయింపు కొద్ది రోజులే అని తెలుస్తోంది. త్వరలోనే వాటితో పాటు ఔషధాలపైనా టారిఫ్ బాంబ్ పేల్చనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు తదితర వస్తువులు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వస్తాయని ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ వెల్లడించినట్లు తెలిపింది. 2 నెలల్లో కొత్త సుంకాలు విధించనున్నట్లు వివరించింది.
Similar News
News April 17, 2025
కంచ భూములు ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదు: టీపీసీసీ చీఫ్

TG: కంచ గచ్చిబౌలి భూములను ప్రైవేటు పరం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు విషయంలో KTR ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. BRS హయాంలో HYD చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని విమర్శించారు. గతంలో చాలా సార్లు BRSకు కోర్టుల చేతిలో మొట్టికాయలు పడ్డాయని గుర్తు చేశారు. కోర్టులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని చెప్పారు.
News April 17, 2025
25న ‘గురుకుల’ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

AP: గురుకుల స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఈ నెల 25న పరీక్ష జరగనుంది. గురుకుల విద్యాలయాల సంస్థ అభ్యర్థుల హాల్‌టికెట్లను ఇవాళ విడుదల చేసింది. <
News April 17, 2025
పాతబస్తీలో మెట్రో.. చారిత్రక కట్టడాలకు నష్టం కలగొద్దు: హైకోర్టు

TG: పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై నెలకొన్న అభ్యంతరంపై హైకోర్టులో విచారణ జరిగింది. మెట్రో నిర్మాణం వల్ల ఇక్కడి చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని పిటిషన్ దాఖలైంది. దీంతో పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయొద్దని, వాటి వద్ద నిర్మాణ పనులు చేపట్టొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.