News April 14, 2025
వనపర్తిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. WNP ప్యాటగడ్డకు చెందిన గంగపురి శేఖర్ సాగర్ వారం క్రితం తన భార్య చిట్టితో కలిసి బైక్‌పై వస్తున్నారు. గోపాల్పేట మం. బుద్దారం గండిలో ఓ ట్రాక్టర్ వీరిని ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సపొందుతూ శేఖర్‌సాగర్ మృతిచెందారు.
Similar News
News September 17, 2025
తిరుమలలో పులివెందుల వాసి మృతి

తిరుమలలో బుధవారం శ్రీవారి భక్తుడు మృతి చెందాడు. టీటీడీ అధికారుల ప్రకారం.. కడప జిల్లా పులివెందుల తాలూకా పార్నపల్లికి చెందిన శ్రీవారి భక్తుడు తిరుమల అద్దె గదుల ప్రాంతంలోని ఓ బాత్రూంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు అతను గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
మెదక్: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రులు

హైదరాబాద్ అమీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం PLAN INTERNATIONAL ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 17, 2025
కేరళలో PAM కలకలం.. 19 మంది మృతి

కేరళలో ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM) అనే ప్రాణాంతక వ్యాధి కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 61 కేసులు, 19 మరణాలు సంభవించాయి. క్లోరినేషన్ సరిగా లేని నీటిలో ఉండే నేగ్లేరియా ఫౌలెరీ(మెదడును తినే) అమీబా వల్ల ఇది వ్యాపిస్తుంది. ఈత/స్నానం సమయంలో నీటి ద్వారా మనుషుల శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి సోకితే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.