News April 14, 2025
బెల్లంపల్లిలో మహిళ అరెస్ట్

బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ముందు అక్రమంగా దేశీదారు విక్రయిస్తున్న మహిళను ఆదివారం అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా కోట సారమ్మ వద్ద 9 లీటర్ల దేశీదారు మద్యం లభ్యమైందని పేర్కొన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News April 17, 2025
పోలవరం: మట్టి నాణ్యతను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణులు

పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు గురువారం కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర నిపుణుల బృందం దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబరేటరీలో పరీక్షతోపాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో మట్టిని పరిరక్షిస్తామని అధికారులు తెలిపారు.
News April 17, 2025
ఆ 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగాలు కోల్పోయిన 25వేల మంది టీచర్లకు సుప్రీంకోర్టు కాస్త ఉపశమనం కలిగించింది. నూతన నియామకాలు చేపట్టేవరకు వారు విధులు నిర్వహించవచ్చని తెలిపింది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో 25వేల టీచర్ నియామకాలు చెల్లవని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
News April 17, 2025
అమానుషం.. బధిర బాలికపై సామూహిక అత్యాచారం?

UPలో 2 రోజుల క్రితం అదృశ్యమైన ఓ 11 ఏళ్ల మూగ-చెవిటి బాలిక అర్ధనగ్నంగా, అపస్మారకస్థితిలో కనిపించింది. ఆమె ముఖంపై గాయాలు, పంటిగాట్లు, మర్మాంగాలపై సిగరెట్‌తో కాల్చిన గుర్తులున్నట్లు వైద్యులు తెలిపారు. సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు SP అతుల్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.