News April 14, 2025

ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర..!

image

వివాహేతర సంబంధంతో ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం హవేలీ సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ముదిగొండ (మం) సువర్ణపురంకు చెందిన ధర్మ భార్యతో.. రామాంజనేయులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలి భర్త(ధర్మ)ను అడ్డు తొలగించాలని తన స్నేహితులతో కుట్ర చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Similar News

News April 17, 2025

గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా

image

సౌతాఫ్రికాలో జరిగిన ఇన్విటేషనల్ ఈవెంట్‌లో ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా సత్తా చాటారు. 84.52 మీటర్ల జావిలింగ్‌ త్రో విసిరి గోల్డ్ మెడల్ సాధించారు. మెుత్తంగా ఆరుగురు పోటీపడ్డ ఈ ఇన్విటేషనల్ ఈవెంట్‌లో విజేతగా నిలిచారు. వచ్చే నెలలో దోహా డైమండ్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా తన సీజన్‌ను విజయంతో ప్రారంభించారు.

News April 17, 2025

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు 

image

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 

News April 17, 2025

పోలవరం: మట్టి నాణ్యతను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణులు

image

పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు గురువారం కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర నిపుణుల బృందం దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబరేటరీలో పరీక్షతోపాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో మట్టిని పరిరక్షిస్తామని అధికారులు తెలిపారు.

error: Content is protected !!