News April 14, 2025

సంగారెడ్డి: ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానం

image

మైనార్టీ గురుకుల పాఠశాలలలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి దేవుజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి, ఆరవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం www.tmreis.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు సమీపంలోని మైనార్టీ పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 17, 2025

భూపాలపల్లి: పోటాపోటీగా ప్రజల మధ్య పర్యటనలు

image

భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రజల మధ్య పర్యటిస్తున్నారు. MLA గండ్ర సత్యనారాయణ రావు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను కలుస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కార్యకర్తలను సమాయత్తం చేస్తూ పరామర్శలు, శుభకార్యాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కీర్తి రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

News April 17, 2025

భూ భారతిలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు: మంత్రి

image

TG: భూ భారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట(D) మద్దూరులో భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ‘ధరణిలో డబ్బులు కట్టాల్సి వచ్చేది. భూ భారతిలో రూపాయి కూడా చెల్లించకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. గత ప్రభుత్వం పేదల భూములను కొల్లగొట్టింది. ఆడిట్ చేసి ఆ భూములను అర్హులైన పేదలకు ఇస్తాం’ అని పేర్కొన్నారు.

News April 17, 2025

వేములవాడ: రాజన్న ఆలయ విస్తీర్ణ పనుల కోసం సమావేశం

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ చేరుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తీర్ణ పనుల కోసం ఆలయ గెస్ట్ హౌస్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వేములవాడకు చేరుకున్న శైలజ రామయ్యకు కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా స్వాగతం పలికారు.

error: Content is protected !!