News March 27, 2024
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నారు. ఇవాళ జరగనున్న సీఈసీ భేటీలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దీపాదాస్ మున్షీ, భట్టి, ఉత్తమ్ సహా కీలక నేతలతో సీఎం సమావేశం నిర్వహించి, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటివరకు 9మంది అభ్యర్థులను ప్రకటించింది.
Similar News
News March 18, 2026
సాంగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన మంగ్లీ

పాన్ ఇండియా మూవీ ‘KD: ది డెవిల్’లో తాను పాడిన <<19406830>>పాటపై<<>> తలెత్తిన వివాదంపై సింగర్ మంగ్లీ SM వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆ పాటను అన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరినీ నొప్పించడం తమ ఉద్దేశం కాదన్నారు. సవరించిన లిరిక్స్‌తో కొత్త వెర్షన్‌ను ఇవాళ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ఈ పాటలో నటించిన నోరా ఫతేహి కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.
News March 18, 2026
డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం

LPG కొరత నేపథ్యంలో వినియోగదారులు PNGలోకి మారాలని కేంద్రం మరోసారి సూచించింది. LPG సమస్య ఉన్నా ఎక్కడా గ్యాస్ లభ్యత పూర్తిగా ఆగిపోలేదని తెలిపింది. LPG ఉత్పత్తి 40% పెరిగిందని పేర్కొంది. క్రూడ్, పెట్రోల్, డీజిల్ లభ్యత సాధారణంగానే ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రాలు/యూటీలకు అదనంగా 10% కమర్షియల్ LPGని కేటాయిస్తున్నామని.. ఇది భవిష్యత్తులో ఆ ప్రాంతాల్లో LPG నుంచి PNGకి మారేందుకు సహాయపడుతుందని తెలిపింది.
News March 18, 2026
OFFICIAL: SRH కెప్టెన్‌గా ఇషాన్

IPL-2026 ప్రారంభంలోని కొన్ని మ్యాచులకు యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని SRH ప్రకటించింది. అలాగే అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఉంటారని పేర్కొంది. పాట్ కమిన్స్ వెన్నునొప్పి గాయం నుంచి కోలుకున్న తర్వాత జట్టులో చేరుతారని తెలిపింది. దీంతో ఈనెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్‌లో కిషన్ జట్టును నడిపించనున్నారు.


