News April 14, 2025
కొండాపూర్:ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు

జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు. అన్ని పాఠశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. nవేసవి సెలవులో తరగతులు నిర్వహించవద్దని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2025
కరీంగనర్: ఏప్రిల్ 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ

గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మున్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ LRSపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రచారం కల్పించాలన్నారు. ఫీజు చెల్లిస్తే లేఔట్ల భూక్రమబద్ధీకరణ మంజూరు పత్రాలను జారీ చేయాలని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఏసీ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News April 18, 2025
కేంద్ర మంత్రికి ఎంపీ అంబికా ప్రశంస

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్-2025గా ఎంపికైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. తెలుగు వ్యక్తిగా ఆయనకు వచ్చిన ఈ అంతర్జాతీయ గుర్తింపు.. మన రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణమన్నారు. శ్రమ, సమర్ధత, విజన్ కలిగిన యువ నాయకుడు రామ్మోహన్ అని ఎంపీ ప్రశంసించారు.
News April 18, 2025
జగిత్యాల: జర్మనీలో ఉపాధి కోసం ఉచిత శిక్షణ

ట్రిపుల్ విన్ ప్రాజెక్టు కింద జర్మనీలో ఉపాధి అవకాశాల కోసం అర్హులైన నర్సింగ్ సిబ్బందికి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. గుర్తింపు పొందిన కాలేజీల నుంచిGNM, BSC నర్సింగ్ చేసి 21 – 38 మధ్య వయసు వారు అర్హులన్నారు. వివరాలకు https://tomcom.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.